Ganta Srinivasa Rao Tweet: జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చాలానే ఉందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ‘వై ఏపీ హేట్స్ జగన్’ (Why AP Hates Jagan) అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అందులో అమరావతి నుంచి తరలి వెళ్లిన సంస్థలను ప్రస్తావించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు. కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌వైపే రావట్లేదని అన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం అమరావతిలో కేంద్రీయ కార్యాలయం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో గందరగోళాలు, నిర్లక్ష్యాలు జరగకుండా అమరావతి రాజధానిగా ఉండి ఉంటే.. ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాలు ఇప్పటికే అమరావతిలో ప్రారంభించి ఉండేవని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని.. ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడదామని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
అమవావతి నుంచి తరలి వెళ్లిన సంస్థల జాబితా:
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఎస్ఐడీ)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్)
- డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్
- ఇండియన్ నేవీ
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)
- కేంద్రీయ విద్యాలయ-1
- కేంద్రీయ విద్యాలయ-2
- నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం
- సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
- కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)
- సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐ)
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)
- భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)
- విదేశ్ భవన్ (కేంద్ర విదేశాంగశాఖ ఆధ్వర్యంలో)
- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)
- ఇండియన్ ఆర్మీ
- రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)
- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడిఎస్ఐ)
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్
- ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్)
- కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
- నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)
- భారత జీవిత బీమా సంస్థ (ఎలస్ఐసీ)
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)
- న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్)
- సిండికేట్ బ్యాంక్ (ఆఫీస్ స్పేస్)
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (హెచ్పీసీఎల్)
- రెయిల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)
- ఇండియన్ బ్యాంక్ హడ్కో రీజినల్ ఆఫీస్
- విజయా బ్యాంక్
- కెనరా బ్యాంక్
- గెయిల్ ఇండియా లిమిటెడ్
ఇలా ఎన్నో సంస్థలు మోహం చాటేశాయని.. అమరావతికి.. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన వలన రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని మండిపడ్డారు. చరిత్ర పుటల్లో ఆంద్రప్రదేశ్‌ను అట్టడుకు నెట్టడంలో మనం బాగస్వామ్యులం కాకుండా ఓటు అనే ఆయుధంతో 2024లో ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి మన రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుందామని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
-
జగనన్న దెబ్బకు అమరావతి కి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే సాటి తెలుగు పౌరులుగా మనం సిగ్గు పడాలి......
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగలడంతో కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు అసలు ఏపీ జోలికి రావడం మానేశాయి.
పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా… pic.twitter.com/Q9p43Cs3xT
">జగనన్న దెబ్బకు అమరావతి కి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే సాటి తెలుగు పౌరులుగా మనం సిగ్గు పడాలి......
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) November 18, 2023
దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగలడంతో కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు అసలు ఏపీ జోలికి రావడం మానేశాయి.
పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా… pic.twitter.com/Q9p43Cs3xTజగనన్న దెబ్బకు అమరావతి కి మొహం చాటేసిన సంస్థల జాబితా చూస్తుంటే సాటి తెలుగు పౌరులుగా మనం సిగ్గు పడాలి......
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) November 18, 2023
దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగలడంతో కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు అసలు ఏపీ జోలికి రావడం మానేశాయి.
పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా… pic.twitter.com/Q9p43Cs3xT
Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ షాక్.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు..