రాష్ట్రంలో తిరిగి తెదేపానే అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో గంగమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్న ఆమె.. గంగమ్మ తల్లి తమ ఇలవేల్పు అని.. ఇక్కడ గుడి ఉందని తెలుసుకుని దర్శనం కోసం వచ్చానన్నారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకమని.. తమ అబ్బాయి జయదేవ్ మళ్లీ ఎంపీగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట కోడలు పద్మావతి ఉన్నారు.
ఇవీ చదవండి..