Central Budget Details: దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.
ఏపీ సంస్థలకు కేటాయింపులు..
- ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ - రూ. 47 కోట్లు
- పెట్రోలియం యూనివర్సిటీ - రూ. 168 కోట్లు
- విశాఖ స్టీల్ ప్లాంట్ - రూ. 683 కోట్లు
తెలంగాణ సంస్థలకు కేటాయింపులు..
- సింగరేణి - రూ.1,650 కోట్లు
- ఐఐటీ హైదరాబాద్ - 300 కోట్లు
- మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు - రూ. 1,473 కోట్లు
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు..
- రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలు - రూ. 37 కోట్లు
- మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు - రూ. 6,835 కోట్లు
- సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు - రూ. 357 కోట్లు
బడ్జెట్‌పై బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి: రోనా తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించాలని.. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్టం సూచించిన అనేక అంశాలను కేంద్రం బడ్జెట్‌లో చేర్చిందన్నారు. ఐతే రాష్ట్రానికి కేటాయింపుల వి।షయంలో ఇప్పుడే ఏం చేప్పలేమని.. క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పారు.
ఇవీ చదవండి: