ETV Bharat / state

ఓటర్లకు పంచడానికి సిద్ధంగా స్టీల్ బాక్సులు.. పట్టుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా మేడికొండురులో ఓటర్లకు పంచడానికి సిద్దం చేసిన స్టీల్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందితో కలిసి గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా స్టీల్ బాక్సులు కనిపించాయని పోలీసులు తెలిపారు.

four hundred steel boxes were seazed in guntur district
నాలుగు వందలు స్టీల్ బాక్సులు పట్టివేత
author img

By

Published : Feb 20, 2021, 11:17 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండల కేంద్రంలో ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన 400 స్టీల్ బాక్సులను శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సిబ్బందితో కలిసి గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా స్టీల్ బాక్సులు కనిపించాయని ఎస్సై నరహరి తెలిపారు.

అనుమానంతో ఆరా తీయగా.. 21న పోలింగ్​ను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు పంపిణీ చేయడానికి ఓ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిల్వ ఉంచినట్లు తెలిసిందని సీఐ ఆనందరావు వివరించారు. మరోవైపు.. మండలంలోని ఓ గ్రామంలో రాత్రి మహిళా ఓటర్లకు చీరలు, కొన్నిచోట్ల డబ్బులు పంచినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ఆపదలో స్నేహితురాలి కుటుంబం.. ఆదుకున్న మిత్ర బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.