గుంటూరు రూరల్ మండలం మల్లవరం గ్రామంలో నూతన సచివాలయం, మిల్క్ యూనిట్ సెంటర్లకు హోంమంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల లాగా సీఎం జగన్ పాలన ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా జరుగుతున్న సేవలు ఎంతో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఈ రెండు ఏళ్లలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2 లక్షల 39 వేలకు పైగా లబ్ది పొందారని వివరించారు.
ఇవీ చదవండి