సీఎం మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సీఎం మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకోవాలన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నారు. రాజధాని తరలించే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా అర్పించి రాజధానిని కాపాడుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు.
ఇవీ చూడండి...