గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి....రైతుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. హరిశ్చంద్రాపురంలో నాడు- నేడు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బోరుపాలెంలో మహిళలు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే వెనక్కి పోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో తుళ్లూరులో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీని జాదాంధ్రప్రదేశ్గా మార్చిన ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే రాజీనామా చేయాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతాల్లో రైతుల ఉద్యమం 328వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో రైతులు ఆందోళన కొనసాగించారు.
ఇదీ చదవండి