గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆయనను మాచర్లకు తీసుకు వచ్చారు. తిరిగి అనారోగ్యం దెబ్బతినటంతో.. ఈ ఉదయం లక్ష్మారెడ్డి స్వగృహంలో మరణించారు. ఆయన మృతదేహానికి పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుత ప్రభుత్వ విప్,స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి లక్ష్మారెడ్డి స్వయానా పెదనాన్న. లక్ష్మారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు సన్నిహితునిగా మెలిగారు. లక్ష్మారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు మాచర్లకు రానున్నారు.
ఇదీ చదవండీ.. 'దావాల దాఖలుకు మళ్లీ పాత గడువే'