ETV Bharat / state

రసాయనాల్ని పట్టేస్తుంది... అన్నదాతలకు ఆదాయాన్నిస్తుంది! - open

అధిక దిగుబడులు సాధించాలనో, చీడపీడల బెడద నుంచి పంటను కాపాడాలనో సాగులో రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. పండ్లు,కూరగాయల్లో రసాయనాల శాతమెంతో తెలుసుకోకుండానే మనం వాటిని తినేస్తుంటాం. త్వరలో ఈ సమస్య తీరబోతుంది. ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల... రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఆహార ప్రయోగశాల
author img

By

Published : May 7, 2019, 10:14 PM IST

కల్తీని కనిపెడుతుంది

వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలతోపాటు ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరులోని లాంఫామ్‌లో ప్రయోగశాల సిద్ధమవుతోంది. ఇది అందుబాటులోకి వచ్చాక... స్థానికంగా మనం వినియోగించే ఆహార పదార్థాలు, పానీయాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే వాటికి నాణ్యతను పరీక్షించవచ్చు. ఆహార పదార్థాలను పరీక్షించి నాణ్యతా ధ్రువపత్రాలు మంజూరు చేయనున్నారు.

తద్వారా రసాయనాలు లేని ఆహార పదార్థాలను అందించేందుకు ప్రయోగశాల ఉపయోగపడుతుంది. అలాగే చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచే క్రమంలో ఆరోగ్యానికి హానికలిగించే రసాయనాలు ఏమైనా వినియోగించారనేది తెలుసుకోవచ్చు. వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తరపున ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భవన నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లేబొరేటరీస్‌ (ఎన్​ఏబీఎల్) ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు.

రైతులకేంటి లాభం?

ప్రయోగశాల జారీ చేసే నాణ్యతా ధ్రువపత్రం ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలు పొందడానికి వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ప్రయోగశాల పనులు తుది దశలో ఉన్నాయని, జులై నాటికి సేవలు అందిస్తామని ఉద్యాన పరిశోధన కేంద్రం విభాగాధిపతి హరిప్రసాద్‌ తెలిపారు. ఇప్పటివరకు నాణ్యత పరీక్షల కోసం అధిక సొమ్ము చెల్లించి... ప్రైవేటు ప్రయోగశాలపై ఆధారపడుతున్నాం. ఇపుడు ప్రభుత్వం తరపున ప్రయోగశాల ఏర్పాటు చేయటం వల్ల రైతులు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అలాగే ప్రజలకు నాణ్యమైన, కల్తీలు లేని ఆహారం అందించే వీలుంటుంది.

Intro:Ap_Nlr_01_06_Prasanthanga_Saguthunna_Polling_Kiran_Av_C1

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లోని ఇసుక పాలెంలోని 41వ పోలింగ్ బూత్ లో రీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. చంటిపిల్లల్ని సైతం తీసుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వృద్ధులు నడవలేని వారి కోసం వీల్ ఛైర్లు ను ఏర్పాటు చేశారు. పది గంటల సమయంలో 1084 ఓట్లకు గాను 243 ఓట్లు పోలయ్యాయి. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది.

Body: కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.