గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ప్రకాశం బ్యారేజీలకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో 16 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,76,778 క్యూసెక్కులు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా...ప్రస్తుత నిల్వ 310.55 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా... ప్రస్తుత నిల్వ 589.5 అడుగులు మేర నీరుంది.