గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో వరద నీరు భారీగా రావడంతో చేపల కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వరద నీరు వచ్చినా గ్రామంలో ఉన్న స్కూళ్లలోకి బాధితులను అధికారులు పంపిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం చేపల కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు.
వరదలు వచ్చిన ప్రతిసారీ.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నవారు ఎన్ని సార్లు రేషన్ కార్డు కోసం ధరఖాస్తు పెట్టుకున్నా అధికారులు ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. ఈ గ్రామాన్ని వరద ముంపు గ్రామంగా ప్రకటించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: