గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కొండలపై ఆకస్మికంగా మంటలు చుట్టుముట్టాయి. బోయపాలెం జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపార్వతిదేవి ఆలయం వెనుక ఉన్న కొండలపై మంటలు చేలరేగడాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 100 మీటర్ల వరకు కొండపైకి మంటలు వ్యాపించాయి. బోయపాలెం నుంచి సంగంగోపాలపురం వైపు గాలి వీయడంతో ఆ దిశగా మంటలు వెళ్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
తెదేపా కార్యకర్తల జోలికి వస్తే.. వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్