గుంటూరు జిల్లా తెనాలిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. నందివెలుగులోని సబ్బుల తయారీ కర్మాగారానికి ఆయిల్ తీసుకెళ్తున్న ట్యాంకర్లో.. సంగంజాగర్లమూడి-నందివెలుగు మధ్య ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినట్లు స్టేషన్ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కంచర్లపాలెంలో దాదాపు రెండు ఎకరాల వరిగడ్డి వాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే తెనాలి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ. 20 వేల నష్టం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక అధికారి ప్రాథమికంగా తేల్చారు.
ఇదీ చదవండి: