గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలోని కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం జరిగింది. మెటీరియల్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగుల డబ్బాలు, కెమికల్స్ దించుతున్న సమయంలో ఒక కెమికల్ డబ్బా కిందపడి మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సహాయక చర్యలు చేపట్టి...మంటలు ఆర్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి. పులిచింతలకు భారీగా వరద..18 గేట్లు ఎత్తి నీరు విడుదల