ETV Bharat / state

FIRE ACCIDENT: మంచాలు తయారు చేసే కార్ఖానాలో అగ్ని ప్రమాదం.. రూ. 7 లక్షల నష్టం

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంచాలు తయారుచేసే ఏడు గదుల కార్ఖానాలో మంటలు చెలరేగి 5 గదుల్లోని ముడి సరకు, ఇతర సామాగ్రి దగ్ఢమైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ సుమారు రూ. 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. యజమాని మాత్రం ఇది ఎవరో కావాలని చేసిన పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

FIRE ACCIDENT
FIRE ACCIDENT
author img

By

Published : Aug 9, 2021, 2:15 AM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ముత్తంశెట్టివారిపాలెంలోని ఒక వడ్రంగి పని చేసే కార్ఖానాలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడు గదుల పెద్ద కార్ఖానాలో నిర్వహిస్తుండగా.. మిగిలిన రెండు గదుల్లో వృద్ధులు నివసిస్తున్నారు. గదుల్లో ఉన్న.. మంచాలు తయారు చేసేందుకు వినియోగించే చెక్క సామాను ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరితగతిన వ్యాప్తి చెందాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

రెండు గదుల్లో ఉన్న వృద్ధురాలు అలుముకున్న దట్టమైన పొగలు చూసి హుటాహుటిన బయటికి పరిగెత్తారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. చెక్క సామాన్లు మొత్తం పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. ప్రమాదంలో మొత్తం రూ. 7 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు బాధితులు వాపోతున్నారు. కావాలనే ఎవరో తమ కార్ఖానాకు నిప్పు పెట్టి ఉంటారని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.