గుంటూరు జిల్లా తెనాలిలోని తేలప్రోలు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి.. నాలుగు ఎకరాల్లోని గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. అవి గ్రామానికి చెందిన ఏ. వెంకటేశ్వరరావు, ఎస్కే. మస్తాన్ వలీకి చెందిన గడ్డివాములుగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 90 శాతం వరి గడ్డి అగ్నికి ఆహుతైంది. ఒక్కో గడ్డివాముకు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.
మరో ఘటనలో..
చుండూరు మండలంలోని వేటపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి వీరాంజనేయులు అనే వ్యక్తి పూరిల్లు దగ్ధమైంది. దాదాపు రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. మంటలు అదుపులేకి తెచ్చామన్నారు.
ఇదీ చదవండి: