వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పురుగుమందులకు సంబంధించిన దుకాణాలు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. ఆ తర్వాత దుకాణాలు మూసివేయాల్సిందే. ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు అవసరమైన ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు ఆయా దుకాణాలకు దారిపట్టారు. అయితే 11 గంటల తర్వాత దుకాణాలు మూసి ఉండటంతో రైతులు వెనుదిరగాల్సిన పరిస్థితి. రైతులకు ఎరువులు, పురుగుమందులు అందించేందుకు ఆయా దుకాణాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరచి ఉంచేందుకు అనుమతించాలని డీలర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వం ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంచి రైతులకు అవసరమైన సామగ్రిని అందించేందుకు అవకాశం ఇవ్వాలని డీలర్లు పేర్కొంటున్నారు. ఈ నెల 30న సీఎం ఆధ్వర్యంలో జరగనున్న వ్యవసాయ సమావేశంలో ముఖ్యమంత్రికి విన్నవించనున్నట్లు డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటనాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి