గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో రెవెన్యూ అధికారులు గురువారం గ్రామసభలు ఏర్పాటు చేశారు. పెన్నా, గోదావరి అనుసంధానం కోసం భూముల సేకరణపై నకరికల్లు, నర్సింగపాడు, గుళ్లపల్లి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు
పెన్నా, గోదావరి అనుసంధానం కోసం నకరికల్లు మండలంలో మొత్తం 628 ఎకరాలు భూములు అవసరం కాగా భూములిచేందుకు రైతులు నిరాకరించారు. ఈ ప్రాంతం సారవంతమైన భూములు కావడంతో ఏడాదికి మూడు పంటలు పండుతాయని ఎంత డబ్బిచ్చినా భూములు వదులుకోమని రైతులు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు