గుంటూరు జిల్లాలో 6 వేల ఎకరాల్లో నిమ్మతోటల్ని సాగు చేస్తున్నారు. మార్కెట్ సమీపంలో ఉండడంతో...ఎక్కువగా తెనాలి డివిజన్‌లో పండిస్తుంటారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో కాపు తక్కువుగా ఉండడం..డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నిమ్మకు మంచి ధరే లభించింది. కిలో 70 నుంచి 100 రూపాయల వరకూ రైతులు అమ్ముకున్నారు. కానీ మే నెల నుంచి క్రమంగా ధరలు తగ్గడంతో..ప్రస్తుతం కిలో ఐదు నుంచి ఏడు రూపాయలు మాత్రమే పలుకుతోంది.
నిమ్మకాయల ధర పూర్తిగా పడిపోవడంతో..కోత కూలీ కూడా రావడం లేదని....రైతులు కాయలు కోయడం మానేశారు. కాయలన్నీ చెట్టుపైనే పండి రాలి కింద పడిపోతున్నాయి. పొలాలు కౌలుకు తీసుకున్నామని...పెట్టుబడి డబ్బులు కూడా రాలేదని వాపోతున్నారు. 70 రూపాయలున్న నిమ్మ ఐదు రూపాయలకు ఎందుకు పడిపోయిందో అర్థం కావడంలేదని..వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి దోచుకుంటున్నారని...రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించడం, హోటళ్లు మూసివేయం, కర్ణాటక నుంచి ఎక్కువ సరుకు ఎగుమతి అవుతుండడంతో ధరలు తగ్గిపోయాయని..అధికారులు చెప్తున్నారు.
ఇదీ చదవండి: