గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ రచయిత ఎం.డి.నఫీజుద్దీన్ మహమ్మద్(76)మృతి చెందారు. వృద్ధాప్యం మీద పడటంతో కొంతకాలంగా మోకాళ్ల నొప్పులు వంటి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నఫీజుద్దీన్.. బుధవారం రాత్రి 8 గంటలకు కొత్త పేటలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎం.డి. సౌజన్య పేరుతో రచయితగా ఆయన.. పాఠక లోకానికి సుపరిచితం. ఆయన రాసిన నవలలు, కవితలకు అవార్డులు, పురస్కారాలు, బిరుదులు అనేకం వరించాయి. ఎండీ.నఫీజుద్దీన్ మహమ్మద్ రాసిన కథలు, కవితలు, సాహిత్య, సమీక్షా వ్యాసాలు, పలు నవలలు వివిధ పత్రికల్లో ధారవాహికలుగా ప్రచురితం అయ్యాయి. ఆయన ప్రత్యేకంగా రాసిన రేడియో నాటికలన్నీ ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. ఆయన రూపొందించిన స్టేజి నాటకాలు ఈ నాటికి కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రదర్శించబడుతున్నాయి. నఫీజుద్దీన్ 38 తెలుగు పుస్తకాలు, 2 ఆంగ్ల గ్రంథాలు రాశారు. తెలుగు యూనివర్సిటీ సాహితీ అవార్డుతో పాటు 10కి పైగా అవార్డులను సొంతం చేసుకున్నారు.
అయన రాసిన నవలలు కొన్ని..
విముక్తి, విధి విన్యాసాలు, కలల అలలు, ఈ చరిత్ర ఎవరు రాస్తారో, ఆపదలో అనురాధా, మృత్యు లోయ, ఈ నేరం ఎవరిది, మాయా బజార్, మృత్యువుతో ముఖాముఖి.
ఆంగ్ల గ్రంథాలు
వరల్డ్ ఫేమస్ స్టోరీస్, సోషల్ షార్ట్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్
ఇదీ చదవండి