ETV Bharat / state

రేపల్లె పరిధిలో మద్యం దుకాణ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన - certificate verification

విడతల వారీగా మద్యపాన నిషేధాన్ని  అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెనాలి ఎక్సైజ్ అధికారి నరసింహారావు తెలిపారు. రేపల్లె, నగరం పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసేందుకు వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఎంపిక ప్రక్రియ జిల్లా సంయుక్త కలెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

రేపల్లె పరిధిలో మద్యం దుకాణ ఉద్యోగార్థుల ధ్రువపత్రాల పరిశీలన
author img

By

Published : Sep 5, 2019, 11:57 PM IST

Updated : Sep 6, 2019, 10:45 AM IST

రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ (ఏఈఎస్) జి.నరసింహారావు అన్నారు. రేపల్లె, నగరం పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్ వైజర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రేపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించారు. తెనాలి డివిజన్ పరిధిలో మొత్తం 96 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 20 దుకాణాలు ప్రారంభించినట్లు... మిగిలిన 76 దుకాణాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్​మెన్..గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్​మెన్​ పనిచేస్తారని తెలిపారు. రేపల్లె, నగరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 28 సూపర్ వైజర్ పోస్టులున్నాయన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయన్నారు.

ఇదీ చదవండి:

'వివేకా హత్య' నిందితుడి ఆత్మహత్యపై అనుమానాలు: బుద్ధా

Intro:AP_VSP_57_05_UNIT REPAIR COMPLETED BYTE_AV_AP10153Body:
ఉత్తరాంద్రలో ప్రముఖ జ‌ల‌విద్యుత్కేంద్రంగా పేరుగాంచిన సీలేరులో పదిరోజులు క్రితం మరమ్మతులకు గురైన మూడో యూనిట్ ద్వార విద్యుదుత్పత్తిని గురువారం ఉదయం నుంచి ప్రారంబించారు. దీంతో అధికారులు యూనిట్‌ నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేశారు. . సీలేరులో 240 మెగావాట్లు సామ‌ర్థ్యం గ‌ల నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఇందులో స్వదేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన మూడో యూనిట్ లో పదిరోజులు క్రితం సాంకేతిక లోపం తలెత్తింది. యూనిట్‌లోని ట్రస్ట్‌ బేరింగ్‌ ఆయిల్‌ కూలర్‌కు రంద్రం పడింది. దీంతో సాంకేతిక సమస్య వచ్చి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అధికారులు హుటాహుటిన వచ్చి సాంకేతిక సమస్యను గుర్తించి దానిని సరిచేసే ప్రయత్నం ప్రారంబించారు. దీనికి తోడు గత కొన్నాళ్లుగా ట్రస్ట్‌ బేరింగ్‌ కూలింగ్‌ వాటర్‌ పైప్‌ లైన్‌ కూడా లీకేజీలు వస్తుండటంతో దీనిని కూడా అధికారులు సరిచేసే ప్రయత్నం చేసారు. . స్థానికంగా ఉన్న గుత్తేదారులతో సాంకేతిక సమస్యలను సరిచేసారు. బుధవారం సాయంత్రం నాటికి యూనిట్‌ మరమ్మతులు పూర్తికావడంతో బుధవారం రాత్రి యూనిట్‌ను స్పిన్నింగ్‌లో పెట్టారు. గురువారం ఉదయం మూడవ యూనిట్‌ ద్వారా మొదట 20 మెగావాట్లు , తరువాత 40 మెగావాట్లు వేసి గురువారం సాయంత్రం నాటికి పూర్తి లోడ్‌ వేశారు.

Conclusion:Byte:K MALLESWARA PRASAD,EE,APGENCO
Last Updated : Sep 6, 2019, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.