కొంతమంది అక్రమదారులు అక్రమంగా క్వారీల నుంచి ఇసుక తవ్వుకుని సొమ్ము చేసుకుంటున్నారని.. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. వడ్లమూడిలో క్వారీని పరిశీలించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మెరక కోసం తవ్వుతున్నామని చెప్పి.. అధికారులు, నాయకులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.
90 రోజులుగా క్వారీలో తవ్వకాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి జరిగిందని.. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమదారులతో కలిసి అడ్డదారుల్లో మట్టి, ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి...