ETV Bharat / state

'వైకాపా వాళ్లే ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు'

నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా స్థానిక ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని.. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని.. ఇందుకు చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన.. పలు సంఘటనలే కారణమని ఆరోపించారు.

ex minister pathhipati pullarao comments on ycp
ప్రత్తిపాటి పుల్లారావు
author img

By

Published : Feb 5, 2021, 8:54 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోరాటం చేస్తుంటే ..అధికార పార్టీ అక్రమాలు దౌర్జన్యాలతో దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాస గృహంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం, సాతులూరు, కనపర్రు గ్రామాల్లో జరిగిన సంఘటనలు.. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిదర్శనమని ఆరోపించారు.

అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో వైకాపా వారే ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టి... అక్కడ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసి.. వారే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. కనపర్రు గ్రామంలో తెదేపా మద్దతుదారులుగా నామినేషన్ వేస్తున్న వారిని... బుక్కాపురం గ్రామం నుంచి వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలపై వచ్చి బెదిరించడం దుర్మార్గపు చర్య అన్నారు.

సాతులూరులో నామినేషన్ వేస్తున్న మహిళ నుంచి పత్రాలు లాక్కొని వైకాపా నాయకుడు చించివేస్తే ..తిరిగి పోలీసులు ఆమె చేత నామినేషన్ వేయించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మాచర్లలో తెదేపా మద్దతు దారులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వైకాపా వారు అధికారులను బెదిరించడం దారుణం అన్నారు.

నవరత్నాలు.. 20 నెలల పాలనపై నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు వైకాపా ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రలోభాలకు పాల్పడుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఏ తప్పు చేయని బలహీనవర్గాలకు చెందిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై... అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల్లో మార్పు ఉండటంతోనే అధికార పార్టీ భయపడి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుందని విమర్శించారు.

ఇదీ చదవండి: పల్నాడులో పేట్రేగిన నాయకులు.. నామినేషన్‌ వేయకుండా అడ్డగింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.