గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో... యడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ నోడల్ అధికారి డి. మధుసూదన్ రావు ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారుల బృందాన్ని అందుబాటులో ఉంచారు. సొసైటీ ప్రకటించిన సభ్యుల జాబితాపై అభ్యంతరాలు, తమ సభ్యత్వం లేకపోవడం వంటి అంశాలపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈ ఏర్పాటు చేశారు.
యడవల్లి గ్రామంలో 133 మంది, కట్టుబడి వారిపాలెం గ్రామంలో 18 మంది అధికారులకు దరఖాస్తులను అందించారు. ఈ ప్రక్రియ ఆది, సోమవారాల్లోనూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈనెల 28 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈనెల 29న సొసైటీ సభ్యుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు నోడల్ అధికారి మధుసూదన్ రావు వెల్లడించారు.
ఇదీచదవండి.