చిన్నపాటి జాగ్రత్తలతో ఎక్కువ మొత్తంలో ఇంధనం ఆదా చేయొచ్చని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. పొదుపుగా వనరులను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ర్యాలీని.. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉపయోగంలేని సమయంలో లైట్లు, ఫ్యాన్, టీవీ, ఇతర విద్యుత్ వస్తువులను ఆపేయాలని పేర్కొన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ఇంధన పొదుపు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: