విద్యుత్ శాఖలో అపరిష్కృతంగా ఉన్న 9 సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నిరసన బాట పట్టారు. దశల వారీ ఆందోళనలో భాగంగా ఉద్యోగుల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వస్తే ఆ ప్రభావం వినియోగదారులపై ప్రత్యక్షంగా.. ఉద్యోగులపై పరోక్షంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే సిబ్బంది కొరతతో అధిక పని భారం పడుతోందని విచారం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును వెంటనే క్రమబద్దీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐకాస జిల్లా కార్యదర్శి రాజేష్ ఖన్నా.. ఎస్‌ఈ విజయ్ కుమార్ కు నల్లబ్యాడ్జీని ధరింపజేసి సంఘీభావం కోరారు. ఈ నెల 24 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: