రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యా శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మాగాంధీ నయీ తలీం జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన చేసిన విదేశీ యాత్రలు, స్వాతంత్య్రోద్యమంలో బాపూ కృషి తదితర వివరాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకున్నాయి. గాంధీజీ ఆశయాలను సాధించే క్రమంలో ఆయన గురించి ముందు తరాలకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఇదీ చూడండి :