గుంటూరు జిల్లా కాకుమానులో ఈజీఎస్ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని... పనుల్లో పారదర్శకతతోపాటు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని డ్వామా అధికారి డేవిడ్‌రాజ్ సూచించారు. కాకుమాను మండలంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ మార్చి వరకు రూ.5కోట్ల 88లక్షల విలువైన ఉపాధి హామీ పనులు జరిగాయన్న డేవిడ్‌రాజ్... ఆ పనులకు సంబంధించి గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలిన తరువాత రూ.11లక్షలు రికవరీ రావాల్సి ఉన్నట్లు అధికారులు తేల్చారని చెప్పారు.
ఇదీ చదవండీ... జగన్ కేబినెట్లో 45శాతం మంత్రి పదవులు వారికే!