మద్యం లేక మందుబాబులు కరోనా కంటే భయంకరమైన జబ్బులను ఎదుర్కుంటున్నారు. నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు రాష్ట్ర మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి అన్నారు. అయితే ఈ లక్షణాలు రెండు లేక మూడు రోజులు మాత్రమే ఉండి తర్వాత తగ్గిపోతాయని తెలిపారు. కేవలం 5 శాతం నుంచి 10 శాతం మాత్రమే ఫిట్స్ రావటం, చిత్రమైన భ్రాంతులకు లోనవటం, చిత్ర విచిత్రాలగా ప్రవర్తించటంలాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.
ఇలాంటి వారిని క్రమం తప్పకుండా కుటుంబ సభ్యులు ఫిజీషియన్కు లేదా మానసిక వైద్య నిపుణులు చూపించే చికిత్స అందించాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో డి - అడిక్షన్ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తారని తెలిపారు. మధ్యానికి బానిసలై సహనం కోల్పోయి చేతికి దొరికిన హానికర ద్రవాలను సేవిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఎదురైతే 104 టోల్‌ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని సూచించారు.
గంజాయి, మద్యం, అక్రమార్కులపై ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మధ్య నిషేధానికి కృషి చేస్తుందన్నారు.
ఇదీ చూడండి: