గుంటూరు జిల్లా బాపట్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు 104 వ జయంతి వేడుకలను, తన తనయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల పాత బస్టాండ్లో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి, కేక్ కోసి అందరికి పంచారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి ఏరియా ఆసుపత్రిలో మహిళలకు పండ్లు పంచారు. కోన రఘుపతి మాట్లాడుతూ తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నామని బాపట్ల జిల్లా కేంద్రంగా నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చూడండి : బురద పండుగ: సరదాగా చిందేస్తూ, సందడి చేస్తూ