కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచనలు చేశారు. ఇకపై కార్యకర్తలకు పార్టీ భవనాలకు రాకుండా ఇళ్లలోనే ఉండి పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్, ఫోన్ల ద్వారా అందించాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలతో మమేకమవుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ‘‘కరోనా వైరస్’’ పుస్తకాలు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేసి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
ఇదీ చూడండి మాస్క్ లేకుండా తుమ్మినందుకు దేహశుద్ధి!