అర్హులైన 1998-డీఎస్సీ(DSC) బ్యాచ్ అభ్యర్థులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ.. అప్పుడు(1998లో) పాసైన అభ్యర్థులు డిమాండ్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2008- డీఎస్సీ(DSC) క్వాలిఫై అయిన 2,193 మంది అభ్యర్థులను ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాలు మారడంతో పెండింగ్లో ఉంచిన తమకు.. నియామకాలు పూర్తి చేయకుండా అన్యాయం చేస్తున్నారని వాపోయారు. నియామకాల కోసం ఇన్నాళ్లుగా వేచి చూసిన తమను ప్రభుత్వం మోసగించిందని.. మంత్రి ఆదిమూలపు సురేశ్ 2008-డీఎస్సీ అభ్యర్థులకు అమ్ముడుపోయారని ఆరోపించారు.
దీనిని నిరసిస్తూ.. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేశ్ నివాసం దగ్గర ఆందోళనకు యత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తరువాత విశ్వవిద్యాలయం వద్దకు చేరుకున్న డీఎస్సీ(DSC) అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని అభ్యర్థులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: