ETV Bharat / state

'వైయస్​ఆర్ వల్లే.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతోంది' - ఆరోగ్యశ్రీ పథకం 15వ వార్షికోత్సవం తాజా వార్తలు

పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందంటే.. అది దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం 15వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులో ఆరోగ్య మిత్రల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

dr ysr arogyasri scheme anniversary celebrations
గుంటూరులో ఆరోగ్యశ్రీ పథకం 15వ వార్షికోత్సవ కార్యక్రమం
author img

By

Published : Mar 28, 2021, 4:23 PM IST

ఆరోగ్యశ్రీ పథకం 15వ వార్షికోత్సవం పురస్కరించుకుని గుంటూరులో ఆరోగ్య మిత్రల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు పేద బడుగు బలహీన వర్గాల వారికి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాన్ని.. సీఎం జగన్ మరింత ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. ఆరోగ్య మిత్రలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.