గుంటూరు జిల్లావ్యాప్తంగా కొవిడ్ కేర్ కేంద్రాలు, ఆసుపత్రులు, వాటికి అనుబంధంగా కొవిడ్ కేర్ కేంద్రాలలో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 20 కొవిడ్ ఆసుపత్రులుండగా.. అందులో 16 గుంటూరు నగరం పరిధిలోనే ఉన్నాయి. ఆయా ఆసుపత్రులు, కొవిడ్ కేంద్రాల్లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, ఇంజనీరింగ్ విభాగాల అధికారులను జిల్లా పాలనాధికారి.. ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి తనిఖీలకు ఆదేశించారు. ఆయా బృందాలు గుంటూరు నగరంలో పలు హోటళ్లు, కొవిడ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ అగ్నిమాపక భద్రత సదుపాయాలు, విద్యుత్ సరఫరా, వైరింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
ఇదీ చూడండి. కరోనా సోకినా.. మారని దొంగలు