గుంటూరు జిల్లాలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు.
- చేబ్రోలు మండలంలో వాసిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే శానిటైజర్లు, మాస్కులు, టిష్యు పేపర్లు వైద్య సిబ్బందికి, అత్యవసర సేవలు అందించే వారికి..వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు అందజేశారు. కొన్ని రోజులుగా పేదలకు అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంస్థ నిర్వాహకుడు భోజనం అందజేస్తున్నారు.
- నిడుబ్రోలు జడ్పీహెచ్ స్కూల్ 1992 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రారు, పెదకాకాని తహశీల్దార్ వారి ఆధ్వర్యంలో మండల పరిధిలో నంబూరు, పెదకాకాని, వెనిగండ్ల, కొప్పరావురు, ఆటో నగర్ మరియు అగతవరప్పాడు గ్రామపరిధిలోని ఎ.వి.ఎన్ కాలనీలోని వలస కార్మికులకు, నిరుపేదలకు ఉచితంగా బియ్యం, కంది పప్పు అందజేశారు.
- ఉప్పలపాడు గ్రామంలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటైజర్ పంపిణీ చేశారు.
- వెంకటకృష్ణాపురం గ్రామస్థులకు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2,500 మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెదకాకాని తహశీల్దార్ రమేష్ నాయుడు పాల్గొన్నారు.
- పెదకాకాని గ్రామ మాజీ సర్పంచులు ఆళ్ల దశరథ రామిరెడ్డి, వీర రాఘవమ్మ ఆర్థిక సహకారంతో పెదకాకానిలోని జ్యోతినగర్, అంబేద్కర్ కాలనీ, జాన్ అప్సర్ కాలనీ వాసులకు నిత్యావసర సరుకుల కిట్టు అందజేశారు.