ETV Bharat / state

రాజధాని విషయంలో సీఎం నిర్ణయం మారాలని నాగదేవతకు పూజలు - farmers and women agitation news

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని గుంటూరులో రైతులు ఆందోళన నిర్వహించారు. సీఎం నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రార్థిస్తూ.. పూజలు చేసినట్లు మహిళలు తెలిపారు.

farmers agitation
ఆందోళన నిర్వహిస్తున్న రైతులు
author img

By

Published : Nov 18, 2020, 4:04 PM IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 337వ రోజు ఆందోళనలు జరిగాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు.

నాగుల చవితిని పురస్కరించుకొని ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పొంగళ్లు సమర్పించారు. నాగమ్మ తమకు అండగా నిలవాలని, రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం మారాలని పూజలు చేసినట్లు మహిళలు చెప్పారు.

ఇదీ చదవండి:

నకిలీ మిర్చి విత్తనాలు.. రైతులు కన్నీటిపాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.