ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సిరిపురం గ్రామస్తులు... మేడికొండూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి.. అర్హులైన తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నివేశన స్థలాలు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ అధికారి చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకోవడంలేదని వాపోయారు. అంతేకాకుండా గ్రామ రెవెన్యూ అధికారి.. తమను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని... అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: