గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మాలధారణ చేసిన భక్తులు ఇరుముడులు సమర్పించారు. నరసింహస్వామి మాల ధరించి 41 రోజులు దీక్షలు చేసిన భక్తులు.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఇరుముడులతో గిరిప్రదక్షిణ నిర్వహించి స్వామివారికి సమర్పించుకుంటారు.
అందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ చుట్టూ ఏడు కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భక్తులతో కలిసి గిరిప్రదర్శన చేశారు. స్వాములు జై నారసింహా, జైజై నారసింహా నామస్మరణాలతో ప్రాంగణం మార్మోగింది. గిరి ప్రదర్శన అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఇరుముడులు వదిలారు.
ఇదీ చూడండి: ఆటోను ఢీ కొట్టిన కారు.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు