ETV Bharat / state

ప్రేమ తీసిన ప్రాణం.. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య - నరసరావు పేట నేర వార్తలు

ప్రేమ త్యాగం కోరుతుంది. కానీ ఇక్కడ మరో ప్రాణాన్ని కోరింది. వారిద్దరూ రైతుబిడ్డలే. ఇద్దరూ గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. క్షణికావేశంలో అతడు ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.

murder in guntur
murder in guntur
author img

By

Published : Feb 24, 2021, 3:07 PM IST

Updated : Feb 25, 2021, 5:46 AM IST

ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూష (19), బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య కొన్నాళ్లుగా పరిచయం ఉంది. బుధవారం ఉదయం ఇంటి నుంచి అనూష కళాశాలకు బయలుదేరగానే విష్ణువర్ధన్‌రెడ్డి ఫోన్‌ చేసి ముఖ్యమైన పని ఉందని, కలవాలని చెప్పారు. దీంతో అనూష ఇంటి నుంచి కళాశాలకు వెళ్లకుండా అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఆటోలో నరసరావుపేట మండలం పాలపాడు వరకు వెళ్లి ఆటోను పంపేశారు. అటునుంచి సాగర్‌ కాలువ వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. విష్ణువర్ధన్‌రెడ్డి అనూష చున్నీతోనే ఆమె గొంతు బిగించి చంపేసి కాలువలో పడేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్‌కు వచ్చి, విషయం చెప్పి లొంగిపోయాడు. పోలీసులు అనూష మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపిన తెదేపా, సీపీఐ

రోడ్డెక్కిన విద్యార్థి లోకం

అనూష మృతి గురించి తెలుసుకున్న సహచర విద్యార్థులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. బాధ్యులను శిక్షించి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. అనూష మృతదేహంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనకు తెదేపా, వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతుగా వచ్చి హంతకుడ్ని నడిరోడ్డుపై ఉరితీయాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. దిశ చట్టం అమలులో ఉన్నా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నరసరావుపేట సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌ వచ్చి విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినా ఆందోళన విరమించలేదు. చివరకు మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని సబ్‌ కలెక్టర్‌ ప్రకటించారు. కేసు విచారణ త్వరగా పూర్తిచేసి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో రాత్రి 9.40 సమయంలో ఆందోళన విరమించారు. హత్యకేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో త్వరితగతిన విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటామని దిశ పోలీసుస్టేషన్‌ డీఎస్పీ రవిచంద్ర ప్రకటించారు. ప్రేమించాలని వెంటపడి వేధిస్తున్నా అంగీకరించకపోవడంతో తమ కుమార్తెను విష్ణువర్ధనరెడ్డి హత్య చేశాడని అనూష తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్య

మరో అబ్బాయితో చనువుగా ఉందనే..

తమ కళాశాలలోనే చదివే మరో అబ్బాయితో అనూష చనువుగా ఉండటాన్ని చూసి భరించలేక విష్ణువర్ధన్‌రెడ్డి ఆమెపై కోపం పెంచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. అనూష సెల్‌ఫోన్‌లోని చాటింగులో వచ్చిన సందేశాలే వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

ప్రయోజకులు అవుతారనుకుంటే..

ఆ రెండూ రైతు కుటుంబాలే. తాము కష్టపడినా పిల్లలు తమలా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రెక్కలు ముక్కలు చేసుకుని వారిని పెంచారు. చివరకు ఇలా అయ్యేసరికి ఒక్కసారిగా హతాశులయ్యారు. గోళ్లపాడుకు చెందిన కోట ప్రభాకరరావు, వనజ దంపతులది రైతు కుటుంబం. వారి పిల్లల్లో వేణు ఇంజినీరింగ్‌, అనూష డిగ్రీ చదువుతున్నారు. పిల్లలిద్దరికీ ఉన్నత చదువులు చెప్పించేందుకు వారిద్దరూ ఎంతో కష్టపడ్డారు. చదువులో చురుగ్గా ఉన్న అమ్మాయి ఆకర్షణకు లోనవుతుందని ఊహించలేకపోయారు. కళాశాల చదువులో చిగురించిన ఆకర్షణ.. పరిపక్వత లేని ప్రేమ ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విష్ణువర్ధన్‌రెడ్డి తల్లి అంగన్‌వాడీ కార్యకర్త కాగా, తండ్రి వ్యవసాయం చేస్తున్నారు. తమలా పిల్లలు కష్టపడకూడదని కళాశాలకు పంపారు. చదువుకుని పేరు తెస్తారకున్న కుమారుడు హత్య చేశాడన్న వార్తతో ఆ కుటుంబం ఆందోళనకు గురైంది.

అనూష హత్య కలచివేసింది: సీఎం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థిని అనూష హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దర్యాప్తు వేగంగా పూర్తిచేసి, దిశ చట్టం కింద దోషులకు కఠినశిక్ష పడేలా చూడాలని తెలిపారు. అనూష కుటుంబానికి భరోసా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గన్నూ రాలేదు.. జగనూ కనిపించట్లేదు: లోకేశ్‌

అనూష హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. ‘ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్‌ కంటే జగన్‌ ముందొస్తారని కబుర్లు చెప్పారు. దిశ చట్టం అంటూ మాయ చేశారు. ఇప్పుడు గన్నూ రావట్లేదు.. జగనూ కనపడట్లేదు. ఒక్క మహిళకూ న్యాయం జరిగింది లేదు. కళ్ల ముందే ఆడపిల్లలను బలి తీసుకుంటున్నా జగన్‌లో చలనం లేదు. ఇప్పటికైనా ప్రచారపిచ్చి నుంచి బయటికొచ్చి మహిళలకు రక్షణ కల్పించాలి. అనూష కుటుంబాన్ని ఆదుకోవటంతో పాటు హత్య చేసిన విష్ణువర్ధన్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలి’ అని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అనూష తల్లిదండ్రులను ఆయన ఫోన్లో పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేవరకూ తెదేపా అండగా ఉంటుందని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: 'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'

Last Updated : Feb 25, 2021, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.