గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆరో వార్డులో 'వైఎస్సార్ భరోసా' పేరుతో గత ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలను పెంచి 2,250 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, జౌళి శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలిసి కేకును కట్ చేశారు. వ్యవసాయ శాఖకు చెందిన గోడపత్రికలను ఆవిష్కరించారు. జడ్పీ సీఈవో వ్యవసాయ శాఖ కోన రఘుపతిని సన్మానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో 151 సీట్లను వైయస్సార్సీపి పార్టీకి అందించారని... వారికి సేవ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో 158 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందని తెలియజేశారు.
ఇదీ చదవండి... అమితాబ్ పాత్రలో నందమూరి నటసింహం!