ETV Bharat / state

కార్తీకమాస ఉత్సవ ఏర్పాట్లపై ఉపసభాపతి సమీక్ష

author img

By

Published : Nov 12, 2020, 11:41 PM IST

ఈ ఏడాది కార్తీకమాస ఉత్సవాలకు గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక ముస్తాబు అవుతోంది. కరోనా పరిస్థితుల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై.. ఉప సభాపతి కోన రఘుపతి, జేసీ, సబ్ కలెక్టర్​లు సమీక్ష సమావేశం నిర్వహించారు. పదేళ్ల లోపు పిల్లలు, 70 ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

deputy speaker review meet
సమీక్ష నిర్వహిస్తున్న ఉప సభాపతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని.. అధికారులను ఉప సభాపతి కోన రఘుపతి ఆదేశించారు. పురపాలక కౌన్సిల్ హాలులో ఉత్సవ ఏర్పాట్లపై జేసీ, సబ్ కలెక్టర్, స్థానిక అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పదేళ్ల లోపు పిల్లలు, 70 ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటలలోగా సముద్రస్నానాలు, పూజలు ముగించుకుని వెళ్లాలన్నారు. విజయవాడ, గుంటూరు, బాపట్ల నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతుందన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్​లు ధరించి రావాలని సూచించారు. ఈ ఏడాది బీచ్​లో సముద్ర హారతి, ఇతర ఉత్సవాలను నిర్వహించడం లేదని తెలిపారు.

సామాజిక వర్గాల పరంగా కార్తీక వనభోజనాల నిర్వహణకు ఈ సారి అనుమతించటం లేదని జేసీ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఎప్పటికప్పుడు తీరాన్ని శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఎక్కువగా పిచికారీ చేయించాలన్నారు. భక్తులకు తాగునీరు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యాలు కల్పించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటుకు సిద్ధమవ్వాలన్నారు. శ్వాస సమస్యలు ఉన్నవారి కోసం ఆక్సిజన్ పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా సమాచారాన్ని తెలియజేస్తూ.. బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ సంఖ్యలో వాహనాలు వచ్చినా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా.. పోలీసు శాఖ బందోబస్తును పక్కాగా నిర్వహించాలన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించటానికి అధికారులు సమన్వయంతో పని చేసేలా కమిటీలు ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు.

భక్తుల భద్రత కోసం ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, పడవలను సిద్ధంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. అనారోగ్యానికి గురైన వారిని తరలించటానికి రెండు అంబులెన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: నరసరావుపేటలో ఎస్పీ విశాల్ గున్ని పర్యటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.