కొత్త ఇసుక విధానం తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి నిర్ణయమేనని.. అయితే ఈ విధానాన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామనటం సరికాదని గుంటూరు భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యదర్శి ఆది నికల్సన్ అంటున్నారు. ఇప్పటికే 3 నెలలుగా పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం ఇసుక నూతన విధానాన్ని అమలు చేయాలంటూ భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు. ఇసుకను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 8న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి కడప జిల్లాలో సీఎం జగన్ సభకు ఘనంగా ఏర్పాట్లు