ETV Bharat / state

రైతుల సమస్యపై పోరుబాట - పంటలు పరిశీలించిన జనసేన, కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నా - BJP Leaders Dharna at Eluru Collectorate

Declare Drought Mandals in AP: వైసీపీ ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించి.. రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. పంటలు ఎండిపోయి రైతన్నలకు కన్నీరు మిగిలినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పంట ఎండిపోయి ఆందోళనలో ఉన్న రైతులను జనసేన పరామర్శించింది.

declare_drought_mandals_in_ap
declare_drought_mandals_in_ap
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 7:36 PM IST

రైతుల సమస్యపై పోరుబాట - పంటలు పరిశీలించిన జనసేన, కలెక్టరేట్ల వద్ద బీజేపీ ధర్నా

Declare Drought Mandals in AP: రాష్ట్రంలో దుర్భిక్షం తాండవిస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. జనసేన, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సాగునీరు లేక ఎండిపోతున్న పొలాలను జనసేన నేతలు పరిశీలించారు. అర్హత ఉన్న కూడా ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించలేదంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్​పేట, తంగెళ్లమూడి, కొలకలూరు ప్రాంతాల్లో సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను.. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. సాగునీటి నిర్వహణ గురించి తెలియని జగన్‌ ప్రభుత్వం.. పంటలను ఎండబెట్టి రైతులకు కన్నీరు మిగిల్చిందని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జగన్ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే తీరిక లేదు - 361 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి'

"ప్రభుత్వం ఆడుతున్న దొంగాట.. రైతులను ఎంత ఇబ్బంది పెడ్తుందో అర్థం చేసుకోవాలి. వ్యవసాయ రంగం ఈ స్థితిలో చితికిపోయింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, అధికారి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వలేదు. చాలా దుర్మార్గమైన పరిపాలన. రాష్ట్రవ్యాప్తంగా కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించాలి." -నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్

కేవలం 103 కరవు మండలాలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందంటూ.. బీజేపీ కిసాన్‌ మోర్చా పలుచోట్ల ఆందోళనలు నిర్వహించింది. శ్రీకాకుళాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలంటూ కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేశారు. జగన్​ ప్రభుత్వం ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పొలాలకు నీరివ్వకపోగా.. కనీసం కాల్వల్లో పూడికలైనా తీయలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడ్డారు.

సీఎం పర్యటనలో కరవు మండలాల ప్రకటన వస్తుందని ఎదురుచూసిన రైతులకు నిరాశే

BJP Leaders Dharna at Eluru Collectorate: రైతుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఏలూరు కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లిన నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తున్న ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఎండిపోయిన ప్రతి పంటకు భీమా వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

BJP Kisan Morcha Rally: ప్రకాశం జిల్లా మార్కాపురం గడియారం స్తంభం కూడలి నుంచి సబ్‌ కలెక్టరేట్‌ వరకు.. బీజేపీ కిసాన్‌ మోర్చా భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ తర్వాత నేతలు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కరవు మండలాలను ప్రకటించి.. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందిచాలని అన్నారు.

ఎండిపోతున్న పంటలు కాపాడుకునేందుకు పల్నాడు రైతన్నల ప్రయత్నాలు - ప్రభుత్వ అలసత్వంవల్లేనని ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.