కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను అభినందిస్తూ ..గుంటూరులో దేచిరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి శానిటైజర్లు, మాస్కులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పట్టణంలో లక్ష్మీ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాను నివారించడంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని నాయకులు కొనియాడారు.
ఇదీ చూడండి. 'సీఎం చర్యలను అనుమతిస్తే.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'