కని, పెంచి ఉన్నత చదువులు చదివించి తమను ప్రయోజకుల్ని చేసిన తండ్రి చనిపోతే కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన విశ్రాంత అధికారి ఉప్పాల రామకోటేశ్వరరావు మృతి చెందగా.. అతని కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. రామకోటేశ్వరరావుకు కుమారులు లేరు. కుమార్తెలే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఐదుగురు కుమార్తెల్లో మూడో కుమార్తె మాధవిలత తుళ్లూరులో పీహెచ్‌సీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తలకొరివి పెట్టగా.. మిగతా నలుగురు కుమార్తెలు సహకరించారు. సహకార శాఖలో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసి రిటైరైన రామకోటేశ్వరరావు తన ఐదుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించడంతో.. వారు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పెద్ద దిక్కును కోల్పోయిన విషాదంలోనూ మనో నిబ్బరం కోల్పోకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: