గుంటూరు జిల్లా చిలకలూరిపేటనుంచి కోటప్పకొండ వైపు వెళ్లే మార్గంలో.. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు దాసరి గోపాలకృష్ణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు పని నిమిత్తం చిలకలూరిపేటకు బైక్పై వెళ్తున్న గోపాలకృష్ణ పురుషోత్తమ పట్నం సమీపంలోకి వచ్చేసరికి... కోటప్పకొండ వైపు వెళ్తున్న టిప్పర్.. అతని వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణిత ఉపాధ్యాయుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. మృతదేహాన్ని మరణానంతర పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోపాలకృష్ణ మృతితో కుటుంబంతో పాటు మద్దిరాల జవహర్ నవోదయ అధ్యాపకులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: