పాత గుంటూరులో తిక్కన నివశించిన ప్రాంతం ఇప్పటికీ ఆయన స్మృతుల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. కవి మిత్రుడి తొలి ప్రస్థానానికి ప్రాచీన గ్రంథాలయం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ భవనాన్ని 1911లో దాతలు పునఃనిర్మించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఇప్పటికీ స్వతంత్రంగా నడుస్తోందీ గ్రంథాలయం. మొత్తంగా 7వేల500 వరకు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇతిహాస, చారిత్రక గ్రంథాలెన్నో పలకరిస్తాయి. తిక్కన సారస్వత కళాపీఠం ఆధ్వర్వంలోని మహాకవి తిక్కన లిటరరీ అసోసియేషన్ ఈ గ్రంథాలయం బాధ్యతలు మోస్తోంది.
వందేళ్ల ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది. అమూల్య బాంఢాగారం అస్థిత్వం కోసం పోరాడుతోంది. పాత పుస్తకాలు చినిగిపోతున్నాయి. కొత్త పుస్తకాలు పెద్దగా రావడం లేదు. ఈ తరం అటుగా చూడటం లేదు. రోజుకు 20 నుంచి 30కి మించి పాఠకులు కనిపించరు. తగిన మౌలిక సదుపాయలూ లేవు. ఇలాంటి చరిత్రాత్మక గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటున్నారు పాఠకులు. పుస్తకాలు చినిగిపోకుండా సంరక్షించి డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతోంది యాజమాన్యం. తిక్కన జ్ఞానపకాలు చిరస్మరణీయంగా వెలగాలంటే ప్రత్యేక శ్రద్ధపెట్టాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి\