ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు పెడతాం: అమరావతి దళిత ఐకాస రాజధానిలో ఎస్సీలకు వైకాపా ప్రభుత్వం ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా తమను మోసం చేసిందని అమరావతి దళిత ఐకాస నేతలు వాపోయారు. దీనిపై ఆ పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే రాజధాని పేదలకు.. నెల నెలా రూ.5వేలు పింఛను, ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు వాటిని నెరవేర్చలేదని దళిత ఐకాస కన్వీనర్ గడ్డం మార్టిన్ అన్నారు.
తుళ్లూరులో వైకాపా నేతల తీరుని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజకీయాల కోసం మా భూములపై రాద్దాంతం చేస్తోందని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భూముల విలువలు పడిపోయాయన్నారు.
ఇదీ చూడండి. ఇందాపూర్ నుంచి కొయ్యూరు చేరుకున్న అదృశ్యమైన విద్యార్థులు