ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల కేసులో సైబరాబాద్ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్​ను విచారించిన తెలంగాణ హైకోర్టు... ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

TS High Court
పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Oct 28, 2022, 7:11 PM IST

TRS MLAs Buying Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంపై సైబరాబాద్​ పోలీసులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న ధర్మాసనం.. తమ నివాస ప్రాంత వివరాలు సైబరాబాద్ సీపీకి సమర్పించాలని ఆదేశించింది. కేసుతో సంబంధం ఉన్న వారెవరినీ సంప్రదించవద్దని నిందితులకు హైకోర్టు షరతు విధించింది.

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురి నిందితులకు రిమాండ్‌ విధించడానికి.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు.. సాధారణ పిటిషన్ వేయాలని సూచించింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది.

కేసులో సరైన ఆధారాలు లేవని, డబ్బులు కూడా దొరకనందున... నిందితులకు రిమాండ్‌ విధించలేమని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులకు వెంటనే విడుదల చేసి.. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని సూచించారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌కు ఇప్పటికే పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయంపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించడంతో... ఉన్నతన్యాయస్థానం విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.