ETV Bharat / state

సాగు పంటల వివరాలన్నీ ఇక ఆన్​లైన్​లోనే..!

author img

By

Published : Jul 11, 2020, 9:06 AM IST

ఆగస్టు నెలాఖరు వరకు పొలాల్లో పంటల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగు చేసిన పంటల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేసే ఈ కర్షక్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ప్రారంభించారు.

crop details
crop details

సాగు చేసిన పంటల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేసే ఈ-కర్షక్ కార్యక్రమం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి ఆయా శాఖల మండల స్థాయి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసి.. శిక్షణ తరగతులను నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సర్వే శాఖలతో కూడిన సంయుక్త బృంద సభ్యులు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఆగస్టు నెలాఖరు వరకు పొలాల్లో పంటల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేస్తారు. భూమి సర్వే నంబరు, విస్తీర్ణం, సాగు చేసిన పంట రకం వంటి అంశాలను అందులో నమోదు చేస్తారు. ప్రభుత్వ పథకాలన్నీ అమలయ్యేది ఈ వివరాల ఆధారంగానే కాబట్టి.. రైతులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.